ముఖం మీద, పెదవుల పైన ఆవాంచిత రోమాలు నొప్పి, ఖర్చు లేకుండా శాశ్వతంగా పోవాలంటే..

ముఖం అందానికి చాలా ప్రాధాన్యం పెరిగింది. మంచి మనసుకన్నా మంచి అప్పిరియన్స్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే ముఖంపై ఎక్కడయినా అవాంచిత రోమాలు ఉంటే నలుగురిలో ఇబ్బంది పడాల్సి వస్తోంది. అవి కూడా ఎక్కువగా పై పెదవి గడ్డం కింద పక్కన చెంపలు చుట్టూ ఎక్కువగా ఉంటున్నాయ్. అయితే దీనికి నొప్పితో కూడుకున్న వాక్సింగ్ లేదా త్రేడ్డింగ్ లేదా బాగా ఖర్చుతో కూడుకున్న లేజర్ ట్రీట్మెంట్ ఇవన్ని కాస్త ఇబ్బందికరమైనవి. కాని అవాంచిత రోమాలకి ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం ఉంది అంటున్నారు నిపుణులు. సులువుగా ఎలా తొలగించవచ్చో కింద తెలుసుకుందాం..

ఇలా చేస్తే అవాంచిత రోమాల పని పట్టొచ్చు:
* రోజూ స్నానం చేసే ముందు కొద్దిగా కస్తూరి పసుపు తీసుకుని దానిలో చల్లని పాలు కలిపి పేస్టూ లా చేసుకుని ఎక్కడైతే ఆవాంచిత రోమాలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ రాయాలి. తరువాత ఆరాక కడగాలి.
* ఇంకో విధంగా అయితే కొద్దిగా స్వచ్ఛమైన నువ్వుల నునే ముఖానికి రాసుకుని దానిపైన కస్తూరి పసుపుని నీళ్ళల్లో కలిపి రాయాలి. ఆరిన తర్వాత రుద్దుతూ కడగాలి ఇలా చేస్తే అవాంచిత రోమాలు రాలిపోతాయి.
* అయితే ముందుగా ఇది ఎక్కడైనా కొద్దిగా శాంపిల్ గా రాసి చూడాలి. మనకి పడింది అనుకుంటే రోజూ స్నానం చేసే ముందు రాయొచ్చు. కావాలంటే రోజూ లేదనుకుంటే రోజు విడిచి రోజు కూడా రాసుకోవచ్చు.
* కస్తూరి పసుపు ఆయుర్వేదంలో చాలా ఔషదాలు కలిగిన పొడి. అయితే ఇది కేవలం ఆవాంచిత రోమాలే కాకుండా చర్మం మంచి రంగు, నునుపు తేలడానికి కూడా ఉపయోగపడుతుంది.
* ఇది ఎలాంటి వయసువారైన వాడవచ్చు. అలాగే ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్లు ఉండవు.

Comments

comments

Comments are closed.