మీ మూత్రం లో ఈ లక్షణాలు కనబడితే మీకు షుగర్ వ్యాధి వచ్చినట్టే చెక్ చేసుకోండి

షుగర్ వ్యాధి దీనినే మరో పేరుతో మధుమేహం అని కూడా పిలుస్తారు ఈ జబ్బు ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద ముసలి ముతక ప్రతి ఒక్కరికి వదిలిపెట్టకుండా వస్తుంది .ఏ వ్యాధి అయినా, వచ్చిన కొత్తల్లోనే గుర్తుపట్టి, త్వరగా చికిత్స మొదలుపెట్టాలి. లేదంటే వ్యాధి ముదిరిపోతుంది. మొక్కగా ఉన్నప్పుడు వంచలేదు, అది వృక్షమై కీడు చేస్తుంది. ప్రమాదకర వ్యాధులలో మధుమేహం ఒకటి. ఇది చాలా సామాన్యమైన వ్యాధి. దీన్ని మొదట్లోనే కనిపెట్టాలి. ఈ వ్యాధి తాలూకు లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.ఈ వ్యాధి ని ముఖ్యం గా మన మూత్రం ని బట్టి మనకి షుగర్ వ్యాధి వచ్చిందా లేదా అని కూడా చెప్పొచు . మూత్రం తో పాటు మరికొని లక్షణాలు కూడా ఇప్పుడు చెక్ చేద్దాం .

నోటి దుర్వాసన, చిగుళ్ళ వ్యాధి

మధుమేహం మోసుకొచ్చే ఇన్ఫెక్షన్స్ వలన, నాలుక, పళ్ళు, నోరంతా దెబ్బతింటుంది. రుచి సరిగా అనుభవించలేకపోవడం, నోటి నుంచి దుర్వాసన రావడం, చిగుళ్ళు దెబ్బతినటం జరుగుతుంది.

మూత్రం తరుచుగా రావడం

ఇది అందరికి బాగా తెలిసిన లక్షణం. ఒంట్లో పెరిగిన షుగర్ లెవెల్స్ తట్టుకోలేకే, శరీరం అధికంగా మూత్ర విసర్జన చేస్తుంది.మీరు కేవలం 2 లీటర్ నిల్లు తాగిన రోజుకి 11 సార్లకి పైగా వాష్ రూం కి వెళ్తారు . కలర్ మారుతుంది వాసనా కూడా వశ్తుంది .

ఇన్ఫెక్షన్స్

మధుమేహం వలన రోగనిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి, వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ దాకా, అన్ని శరీరం మీద దాడిచేస్తాయి. తరచుగా జ్వరం రావడం, స్కిన్ మీద రాశేష్ ఇలాంటివి సాధారణంగా జరుగుతుంటాయి.

నీరసం

ఎలాంటి శ్రమ లేకపోయినా, నీరసం వచ్చేస్తుంటుంది. మధుమేహం యొక్క ముఖ్య లక్షణాల్లో ఇదొకటి. ఇవి మాత్రమే కాకుండా, చూపు మందగించడం, అరికాళ్ళలో మంట, చర్మం నల్లబడటం , దురద అతిగా వేయడం కూడా మధుమేహ వ్యాధి లక్షణాలే.

Comments

comments

Comments are closed.