లీటర్ తేలు విషం రేటు రూ.26కోట్లు.. ఇంతకీ దానితో ఏం చేస్తారో తెలుసా?!!

ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైన ద్రవ పదార్థంగా తేలు విషం రికార్డు సృష్టిస్తోంది. సాధారణంగా తేలు తన ఆహారం కోసం ఇతర కీటకాలను చంపటానికి, తనను శత్రువుల బారి నుండి రక్షించుకోవటానికి తన కొండి లోని విషాన్ని ఉపయోగిస్తుంది. కానీ అదే విషం మనుషుల్లో ఎన్నో రోగాలకు, రుగ్మతలకు మందుగా పనిచేస్తుందన్న ఆశ్చర్యకరమైన నిజం చాలా మందికి తెలియదు. తేళ్ళలో వేల రకాల జాతులున్నా కానీ కేవలం 25 రకాల జాతులు మాత్రమే జీవులని చంపేటంత విషాన్ని కలిగి ఉంటాయి.

నమ్మలేక పోతున్నాం.. కానీ ఇది నిజమే… ఒక లీటర్ పాము విషం ఖరీదు 27 లక్షలు, అదే తేలు విషమైతే పాము విషానికి 130 రెట్లు ఎక్కువగా 26 కోట్ల ధర పలుకుతుంది. తేలు విషంలోని ప్రోటీన్ కీళ్ళ వాపుకు, పేగు వ్యాధికి, మరియు కొన్ని రకాల కేన్సర్ చికిత్సకు కూడా దివ్యౌషదంగా ఉపయోగపడుతుంది.. అందువలనే ఈ అరుదైన తేలు విషం అంత ఎక్కువ ధర పలుకుతుంది. ఇక మరొక అరుదైన పాము జాతికి చెందిన విషం ఖరీదైతే రూ.20కోట్లు. ఈ విషంతో రకరకాల ఔషధాలు, సౌందర్య సాధనాలు తయారు చేస్తారు. కానీ ఆ విషం ఎంత ఖరీదు ఉంటుందో ఎప్పుడైనా తెలుసుకున్నారా? బీహార్‌లోని పూర్నియా ప్రాంతంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాదాపు 900 గ్రాముల బరువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దాని విలువ అక్షరాలా ఇరవై కోట్ల రూపాయలట! ఇద్దరు వ్యక్తులు దీన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా వాళ్లను పట్టుకుని ఈ విషం స్వాధీనం చేసుకున్నారు. ఒక్క బాటిల్లో ఉన్న ఈ విషం ఏకంగా మూడు కోట్ల రూపాయల విలువ ఉంటుందని తెలుసుకుని అధికారులే నివ్వోరపోయారు. ఎందుకంటే, ఇది పాముల్లోనే అత్యంత విషపూరితమైన కోబ్రా విషం. అందుకనే దీనికి అంత ఖరీదు.

Comments

comments

Comments are closed.