‘సమరసింహారెడ్డి’ నిర్మాతకి జీవిత ఖైదు

‘సమరసింహారెడ్డి’ సినిమా గుర్తుందా.? బాలకృష్ణ సినిమా కెరీర్‌లోనే వెరీ వెరీ స్పెషల్‌ మూవీ అది. ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఆ సినిమా అప్పట్లో పెను సంచలనం. వసూళ్ళ పరంగా ఓ రేంజ్‌లో కుమ్మేసింది. ఆ చిత్ర నిర్మాత చెంగల వెంకట్రావుకి జీవిత ఖైదు పడింది. ఓ వ్యక్తి హత్య కేసులో చెంగల వెంకట్రావు సహా పలువురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. పదేళ్ళ క్రిందటి కేసు అది.

చెంగల వెంకట్రావు గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చెంగల వెంకట్రావు, అప్పట్లో నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడిగా ఓ వెలుగు వెలిగిన విషయం విదితమే. అయితే, 2009 ఎన్నికల్లో ఓడిపోయాక, చెంగల వెంకట్రావు టీడీపీకి దూరమయ్యారు. 2012లో వైఎస్సార్సీపీలో చేరారాయన. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసి, ఓటమిని చవిచూశారు.

బాలకృష్ణతో ‘సమరసింహారెడ్డి’ చిత్రాన్ని నిర్మించి, ఒక్క సినిమాతోనే బాలీవుడ్‌లో టాప్‌ ప్రొడ్యూసర్స్‌లో ఒకరిగా ఎదిగిన చెంగల వెంకట్రావు, జూనియర్‌ ఎన్టీఆర్‌తో ‘నరసింహుడు’ అనే చిత్రాన్ని నిర్మించి, దారుణమైన నష్టాల్ని చవిచూశారు. ఆ ఆర్థిక ఇబ్బందులతోనే అప్పట్లో ఆయన ఆత్మహత్యాయత్నం కూడా చేయడం గమనార్హం.

Comments

comments

Comments are closed.