బుల్లితెరపైన బూతుల పండగ….ఈటీవీ అస్సలు తగ్గట్లేదుగా – Video

చిత్రం సినిమా వచ్చినప్పుడే అందరూ షాక్ అయ్యారు. రామోజీరావు నిర్మాణంలో ఇలాంటి బూతు సినిమా రావడమేంటి అన్నారు. కానీ రామోజీరావు మాత్రం ఎంచక్కా కోట్లు సంపాదించేశాడు. ఆ తర్వాత బుల్లితెరపైన బూతుల ట్రెండ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా మంది మెంటలెక్కిన స్థాయిలో షాక్ అయ్యారు. మిగతా ఛానల్స్‌తో పోలిస్తే ఎంతో కొంత వ్యాల్యూస్‌ని ఫాలో అయ్యే ఈటీవీలో ఈ రేంజ్ బూతుల ప్రోగ్రాం ఎలా టెలికాస్ట్ చేస్తున్నారు? రామోజీరావు ఎందుకు మరీ ఇంతలా దిగజారుతున్నాడు అన్నారు. కానీ ఆ ఏమైంది ఆ జబర్ధస్త్ ప్రోగ్రాం కూడా సూపర్ సక్సెస్. కథ మళ్ళీ సేం టు సేం. రామోజీకి జబర్ధస్త్ ప్రోగ్రాం కూడా కోట్లు తెచ్చిపెట్టింది.

ఇప్పుడిక అదే ఈటీవీ నుంచి అనేక ఛానల్స్. వాటిలో టెలికాస్ట్ చేయడానికి చాలా కంటెంట్ కావాలి కదా. అందుకే ఆ బూతును నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్తున్నాడు. అది కూడా టీనేజ్ స్టూడెంట్స్‌ని పార్టిసిపెంట్స్‌గా, ఆడియెన్స్‌గా తీసుకుంటే ఈ రసవత్తరమైన బూతు కార్యక్రమాలను నడిపిస్తున్నాడు. రీసెంట్‌గా శ్రీముఖి యాంకరింగ్ చేసిన ఓ ప్రోగ్రాంలో అయితే ఆ అతి మరీ పరాకాష్టకు వెళ్ళిపోయింది. బుల్లి బుల్లి బట్టలతో వచ్చిన శ్రీముఖిని ఆన్ ద కెమేరా మేల్ యాంకర్ ఇష్టమొచ్చినట్టుగా టచ్ చేస్తాడు.

ఆ అమ్మాయిని కౌగిలించుకుంటాడు. శ్రీముఖి కూడా ఆ మేల్ యాంకర్ ఒడిలో కూర్చుంటుంది. ఆ ఒడిలో నుంచి లేచిన తర్వాత ‘నీ గడ్డపార గుచ్చుకుంటోంది’ అనే బూతు డైలాగులు పేలుస్తుంది. అది బూతు కాదేమో….అనవసరంగా ఆ యాంగిల్‌లో చూస్తున్నామేమో అనేవాళ్ళు కూడా ఉంటారు కానీ మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తే అది బూతు అన్న విషయం ఎవ్వరికైనా అర్థమవుతుంది. అయినా బుల్లితెరపైకి సన్నీ లియోన్ సెక్స్ పాఠాలు తీసుకురావడానికి కూడా మనవాళ్ళు రెడీ….కాకపోతే కాసులొస్తాయా? రావా? అన్న లేక్కలు కుదిరితే చాలు. ఇక నీతులన్నీ కూడా కేవలం చెప్పడానికే.

Comments

comments

Comments are closed.