తెలివిగా రూ.1.10 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టిన జూనియర్ ఎన్టీఆర్.. ‘కాగ్‌’ ఆగ్రహం!

జూనియర్‌ ఎన్టీఆర్‌కు సేవా పన్ను మినహాయింపుపై ‘కాగ్‌’ ఆక్షేపించింది. విదేశాల్లో సినిమా షూటింగ్‌ పేరుతో ఎన్టీఆర్‌ పన్ను చెల్లించలేదని  నివేదికలో పేర్కొంది కాగ్‌. విదేశాల్లో సినిమా షూటింగ్ సేవల ఎగుమతి కిందికి వస్తుందని చూపిస్తూ ఆయన పన్ను చెల్లించలేదని కాగ్ తెలిపింది. వినోద రంగంలో సేవా పన్నుల చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై కాగ్‌ అధ్యయనం చేసి రూపొందించిన ఈ నివేదికను శుక్రవారం(ఆగస్టు 4) పార్లమెంటులో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌.

‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో హీరోగా నటించినందుకు ఎన్టీఆర్‌ లండన్‌కు చెందిన వైబ్రంట్‌ విజువల్‌ లిమిటెడ్‌ ప్రొడ్యూసింగ్‌ కంపెనీ నుంచి 2015లో రూ.7.33 కోట్లు పారితోషికంగా తీసుకున్నారని కాగ్‌ ఆ నివేదికలో పేర్కొంది. ఎక్స్‌పోర్ట్‌ ఆఫ్‌ సర్వీసు కింద అతను చెల్లించాల్సిన రూ. 1.10 కోట్ల సర్వీసు పన్ను మినహాయించారని వివరించింది కాగ్. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖను వివరణ కోరగా.. జూనియర్‌ ఎన్టీఆర్‌కు పన్ను మినహాయించలేదని, షోకాజ్‌ నోటీసు ఇవ్వబోతున్నామని సమాధానమిచ్చింది ఆర్థిక శాఖకు అనుబంధంగా ఉండే రెవెన్యూ విభాగం. బాలీవుడ్‌లోనూ ఇదే తరహాలో.. ‘‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’’ హిందీ సినిమాను న్యూయార్క్‌లో చిత్రీకరించామని చూపిస్తూ ఆ సినిమా హీరో రణ్ బీర్ కపూర్ రూ. 83.43 లక్షల పన్ను మినహాంపులు పొందిన విషయాన్ని కూడా  కాగ్‌ గుర్తించింది. దీనిపై ఆర్థిక శాఖను వివరణ కోరగా..ఆ సినిమా షూటింగ్ చాలా భాగం విదేశాల్లో జరిగింది.. అందుకే పన్ను మినహాయింపు ఇచ్చామని తెలిపింది.

Comments

comments

Comments are closed.