కొత్తగా పెళ్లయిందా? ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి!!

పెళ్లయిన తర్వాత జీవితంలో కొన్ని అనివార్యమైన మార్పులు ఉంటాయి. అయితే జీవితంలోనేకాకుండా పేపర్లలోనూ మార్పులు చేయాల్సిన అవసరం వస్తుంది. పాస్‌పోర్టు వంటి కార్డులపై జీవిత భాగస్వామి పేరును తప్పనిసరిగా చేర్చాల్సి వస్తుంది. పాస్‌పోర్టుపై వారి పేరును చేర్చడం ఎలాగో తెలీక కొందరు చాలా ఇబ్బందులు పడుతుంటారు. పాస్‌పోర్టు రీ- ఇష్యూకు దరఖాస్తు చేసే విధానం ద్వారా మాత్రమే భాగస్వామి పేరును చేర్చుకునే అవకాశం లభిస్తుంది. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం..

పాస్‌పోర్టుపై జీవిత భాగస్వామి పేరు చేర్చే విధానం:
1. http://passport.gov.in/nri/Online.do ఈ లింక్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
2. ఆన్ లైన్ పూర్తి చేసిన దరఖాస్తును https://passport.gov.in/nri/ లింక్‌ ద్వారా ప్రింట్‌ తీసుకోవాలి.
3. దీనికి సంబంధించిన పత్రాలను జతచేసి పోస్ట్‌ ద్వారాగానీ, ఈ మెయిల్‌ ద్వారాగానీ, స్వయంగాకానీ ఎంబసీ/ కాన్సులేట్‌కు అందజేయాలి
కావలసిన పత్రాలు
1. బీఎల్‌ఎస్‌ ఆర్డర్‌ పత్రంము
2. ప్రస్తుత పాస్‌పోర్టు కాపీ
3. ఆన్‌లైన్‌ దరఖాస్తు
4. పెళ్లి ధృవీకరణ పత్రం
5. నేషనాలిటీ వెరిఫికేషన్‌ పత్రము
6. ప్రస్తుత పాస్‌పోర్టులోని మొదటి అయిదు, చివరి రెండు పేజీల కాపీలు
7. నివాస ధృవీకరణ పత్రము
8. పాస్‌పోర్టు సైజు ఫోటోలు నాలుగు
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు సంబంధిత పత్రాలను జతచేసి ఎంబసీ/ కాన్సులేట్‌లో సమర్పించాలి. దరఖాస్తును పరిశీలించిన తరువాత కాన్సులర్‌ అధికారి వ్యక్తిగత ఇంటర్వ్యూకి పిలుస్తారు. దరఖాస్తు సమర్పించిన ప్రాంతాన్ని బట్టి ఎన్నిరోజుల్లో పాస్‌పోర్టు చేతికి వస్తుందనేది ఉంటుంది.
వాషింగ్టన్‌ డీసీలో ఒకటి నుంచి మూడు వారాలు, న్యూయార్క్‌లో రెండు నుంచి మూడు వారాలు, శాన్‌ఫ్రాన్సిస్కోలో 2-3 వారాలు, చికాగోలో 6-8 వారాలు, హోస్టన్‌, 1-3 వారాలు, అట్లాంటా 6-8 వారాల సమయం పడుతుంది.
దరఖాస్తుకు అయే ఖర్చు
భాగస్వామి పేరు చేర్చడానికి, తొలగించడానికి(మరణిస్తే, విడాకులు తీసుకుంటే) 36 పేజీలు ఉండే ఆర్డినరీ బుక్‌లెట్‌కు 91.20 డాలర్లు, 60 పేజీలుండే జంబో బుక్‌లెట్‌కు 116.20 డాలర్ల ఖర్చవుతుంది.
ఈ సర్వీసుకు తత్కాల్‌ సౌకర్యం కూడా ఉంది. అయితే అభ్యర్థి స్వయంగా వచ్చి దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. దీనికి 1-3 రోజుల్లోగా పని పూర్తవుతుంది. అయితే దీనికి స్థానిక ఎంబసీ, కాన్సులేట్‌ అనుమతి తీసుకోవాలి.
తత్కాల్‌ సర్వీసు ద్వారా భాగస్వామి పేరు చేర్చుకునే అవకాశం కల్పించారు.

Comments

comments

Comments are closed.