నేరేడుపళ్లు వల్ల నయం అయే రోగాల లిస్ట్ తెలిస్తే…

నేరేడు పళ్లు నీలాల కళ్లు… అంటూ నేరేడు పళ్ల గురించి రాశాడో సినీకవిరేడు. నేరేడు పళ్లు రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.ఇంతకీ నేరేడు పళ్లు శరీరానికి చేసే మేలు ఏంటంటే..

  • నేరేడుపళ్లలో గ్లైకమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్‌ వ్యాధికి చక్కగా ఉపయోగపడతాయి. యాంటీ డయాబెటిక్‌ ఎఫెక్ట్స్‌ ఉండే మంచి పండు నేరేడు అని పలు అధ్యయనాల్లో తేలింది.
  • కాల్షియం, ఐరన్‌, పొటాషియం, విటమిన్‌-సి పుష్కలంగా ఉండే ఈ పళ్లు తింటే వ్యాధి నిరోధకశక్తితో పాటు ఎముకలకు గట్టిదనం కూడా వస్తుంది.
  • హిమోగ్లోబిన్‌ స్థాయిని పెంచడానికి ఉపయోగపడతాయి.
  • ఎనీమియా వ్యాధికి మంచి ఔషధం నేరేడు పళ్లు.
  • గుండెసంబధిత వ్యాధులను అడ్డుకునే శక్తి వీటికి ఉంది.
  • నేరేడు చెట్టు ఆకులు, బెరడు, విత్తనాలు బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్స్‌ని తరిమికొట్టడానికి ఉపయోగపడతాయి.
  • నేరేడు పళ్లు తీసుకుంటే డయేరియా వ్యాధి తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా నేరేడు చెట్టు ఆకులు తింటే జీర్ణసంబంధిత సమస్యలను తగ్గుతాయి.
  • క్యాన్సర్‌ రాకుండా చేయడంలో నేరేడు పళ్లు ముఖ్యపాత్ర వహిస్తాయి.
  • వర్షాకాలంలో జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. వీటిని తగ్గింగే గుణం ఈ పళ్లకు ఉంది.
  • శరీరంలో వేడిని తగ్గించి.. తక్షణ శక్తిని ఇస్తాయి.

Comments

comments

Comments are closed.