స్త్రీ, పురుషులు ఏ రోజు తలస్నానం చేస్తే అదృష్టం కలిసివస్తుందో తెలుసా?!!

తలస్నానం అనేది హిందు సాంప్రదయంలో ఆతి ముఖ్యమైనదని పండితులు చెబుతుంటారు. అయితే తలస్నానం కొన్ని రోజుల్లో చేస్తే చాలా అరిష్టం కొన్ని రోజుల్లో చేస్తే చాలా శుభదాయకమట. అయితే ఏ రోజుల్లో చేస్తే శుభం, లాభమని, ఏయే రోజుల్లో చేస్తే నష్టదాయకమని చెబుతున్నారో కింద చూద్దాం..

ఖచ్చితంగా ఈ రోజుల్లో చేస్తే ఐశ్వర్యం అదృష్టం రెండు సిద్దిస్తాయట:
* ఆడవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయ వలసిన రోజులు శుక్రవారం, బుధవారం.. అని చెబుతున్నారు. ఈ రెండు రోజుల్లో తలస్నానం చేస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం అయిదవతనం రెండు ఉంటాయట. అలాగే సుఖ జీవనం కలుగుతుందని పేర్కొంటున్నారు.
* అంతే కాకుండా శనివారం ఆదివారం ఈ రెండు రోజుల్లో కూడా చెయ్యవచ్చు కానీ మిశ్రమ ఫలితం ఉంటుంది.
* మగవాళ్ళు బుధవారం, శనివారం చేస్తే మంచి శుభ ఫలితాలు పొందవచ్చని పేర్కొంటున్నారు.
ఈ రోజుల్లో చేస్తే అశుభ ఫలితాలు మరియు దురదృష్టం
* స్త్రీలు లేదా పురుషులు మంగళవారం చేస్తే అస్సలు మంచిది కాదట. ఆరోజు తలస్నానం చేస్తే ఏ పని కలిసిరాకపోవడం, కార్య భంగం జరుగుతుందట.
* సోమవారం చేస్తే తాపం పెరుగుతుంది. పురుషులు మాత్రం శుక్రవారం అస్సలు తలస్నానం చెయరాదట.
* అయితే పండితులు చెబుతున్న ప్రకారం కొన్ని రోజులకు మినహాయింపు ఉంది. పుట్టిన రోజులు, శుభ దినాలు, పండుగలకు మాత్రం మినహాయింపు అంటే ఆ రోజుల్లో ఏ వారమైన చేయచ్చునట.

Comments

comments

Comments are closed.