ఎన్టీఆర్ ముందు మహేష్ తక్కువే..

మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్ర టీజర్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తూ ఉన్నప్పటికీ , మరోవైపు టీజర్ పెద్దగా ఏమి లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. అయినాగానీ టీజర్ కోటి వ్యూస్ సాధించి మహేష్ స్టామినాను గుర్తు చేసింది. కానీ ఎన్టీఆర్ రికార్డు ను మాత్రం మహేష్ కొట్టలేకపోయాడు. టీజర్ రిలీజైన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్ గా ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ నిలిచింది. ఈ సినిమాకు సంబంధించి జై టీజర్ కు కేవలం 24 గంటల్లోనే 4.98 మిలియన్ వ్యూస్ వచ్చాయి. స్పైడర్ టీజర్ కు మాత్రం ఒక రోజులో 4.04 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి.

అయితే స్పైడర్ టీజర్ కు సంబంధించి మొదట్నుంచి తెలుగు, తమిళ్ వ్యూస్ కలిపి చెబుతున్నారు. అలా 24 గంటల్లోనే 8.6 మిలియన్ వ్యూస్ వచ్చాయని చెబుతున్నారు. అది కూడా ఫేస్ బుక్, యూట్యూబ్ వ్యూస్ కలిపి ..కేవలం తెలుగు వెర్షన్ కు సంబంధించిన లెక్కలు చూసుకుంటే మాత్రం జై టీజర్ దే మొదటి స్థానం. మొదటి స్థానం లో ఎన్టీఆర్ జై టీజర్ , సెకండ్ స్థానం లో మహేష్ స్పైడర్ నిలువగా, మూడో స్థానంలో కాటమరాయుడు టీజర్ నిలిచింది. 4, 5 స్థానాల్లో డీజే, సాహో సినిమా టీజర్లు నిలిచాయి.

Comments

comments

Comments are closed.