హీరోయిన్ లావణ్య త్రిపాటి బికినీ ఫొటోస్ నెట్ లో హలచల్

ఓ బ్లాక్ బస్టర్ పడిందంటే హీరోయిన్స్ ని ఆపడం ఇక ఎవరి తరం కాదు. సరైన సినిమా పడే వరకూ బాగా కూల్ గా కనిపించిన అమ్మాయిలు కాస్తా.. మంచి హిట్ ఒకటి ఖాతాలో పడ్డాక తామేంటో చూపించేస్తుంటారు. టాలీవుడ్ కి అందాల రాక్షసిగా పరిచయమైన లావణ్య త్రిపాఠి కూడా ఇంతే.

ఎంతగానో ఎదురుచూసిన హిట్.. భలే భలే మగాడివోయ్ రూపంలో దక్కింది. ఓ బ్లాక్ బస్టర్ అకౌంట్ లోకి వచ్చేసింది. అంతేనా.. మరో రెండు క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున సరసన నటించిన సోగ్గాడే చిన్ని నాయన రిలీజ్ కి రెడీ అవుతోంది. పరశురాం డైరెక్షన్ లో అల్లు శిరీష్ తో కలిసి చేసిన మూవీ పరిస్థితి కూడా ఇంతే. వీటితో మళ్లీ సక్సెస్ సాధించి బిగ్ లీగ్ లోకి ఎంటర్ అయ్యేందుకు ఉత్సాహంగా ఉంది లావణ్య త్రిపాఠి.

ఇప్పుడీ భామ ఇండోనేషియా దీవులు – బాలి ప్రాంతాల్లో చక్కర్లు కొట్టేస్తోంది. ఫ్రెండ్స్ ను  వెంట తీసుకెళ్లి మరీ ఎంజాయ్ చేస్తోంది. సాంగ్ షూటింగ్ కి వెళ్లిందో లేక.. పర్సనల్ ట్రిప్  గా వెళ్లిందో కానీ.. రకరకాల డ్రస్సులతో అక్కడ నానా హంగామా చేస్తోంది. ఇక్కడ ఇంత పద్ధతిగా దర్శనమిచ్చిన లావణ్య.. అక్కడ ఏకంగా బికినీలతో చక్కర్లు కొట్టేస్తోంది. తనవరకైతే పద్ధతైన ఫోటోలనే షేర్ చేస్తోంది కానీ.. ఆన్ లైన్ కాలంలో ఆపాలంటే అన్నీ ఆగవు కదా.. అలా ఒక్కోటీ బైటకొచ్చేస్తున్నాయి. జర జాగ్రత్త లావణ్యా.. వయ్యారాలు కాసిన్ని దాచుకో. అన్నీ ఒలకబోసేస్తే ఎలా.. సినిమాలకు కూడా కాసిని కావాలి కదా.

Comments

comments

Comments are closed.