ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ movie ట్రైలర్ మలయాళం లో ఇంకా సూపర్ గా ఉంది – Video

డైరెక్టర్ కొరటాల శివ ఇదివరకు తెరకెక్కించిన ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలు ఎంతటి ఘనవిజయాలు సాధించాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ‘శ్రీమంతుడు’ మూవీ అయితే ‘టాలీవుడ్‌ సెకండ్ బిగ్గెస్ట్ హిట్’గా నిలిచింది. కొరటాలలాగే ఎన్టీఆర్ కూడా ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాలతో భారీ హిట్స్ అందుకోవడంతోపాటు అటు మాస్, ఇటు క్లాస్ ఆడియెన్స్‌కి చాలా దగ్గరయ్యాడు. దాంతో.. ఎన్టీఆర్‌కి సినీజనాల్లో భారీ క్రేజ్ పెరిగింది. ఇలాంటి వీరిద్దరి కాంబినేషన్‌లో ‘జనతా గ్యారేజ్’ రూపొందడంతో.. దీనిపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. పైగా.. మోహన్‌లాల్ లాంటి స్టార్ హీరో క్రేజ్, నిత్యా-సమంతల గ్లామరసం, రాక్‌స్టార్ దేవిశ్రీ సంగీతం తోడు కావడంతో.. ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపయ్యాయి.

ఆ కారణంగానే.. రికార్డ్ స్థాయిలో ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ రూ.67 కోట్లకు అమ్ముడుపోగా.. శాటిలైట్ రైట్స్‌కి రూ.12.5 కోట్లు పలికాయి. నార్త్ ఇండియాలోనూ ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ అమౌంట్‌కి ఈ చిత్రం రైట్స్ సోల్డ్ అయ్యాయి. రిలీజ్‌కి ముందు బిజినెస్ పరంగా ఇంతటి ప్రభంజనం సృష్టించడంతో.. రిలీజ్ అయ్యాక ఇది రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఐతే ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ movie ట్రైలర్ తెలుగు లో చాల ఫాస్ట్ గా చుసిన మూవీ ట్రైలర్ గా రికార్డు క్రేఅతే చేసింది . ఐతే ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ movie తెఅసేర్ మలయాళం లో రిలీజ్ చేసారు కాని ట్రైలర్ మాత్రం బాగా లేట్ చేశారు ఆ వీడియో మీరే చూడండి.

Comments

comments

Comments are closed.