తొలి సారి కలిసినప్పుడు రక్తస్రావం అయితేనే కన్యత్వం ఉన్నట్టా ? కన్నెపొర గురించి ఆసక్తికరమైన విషయాలు

తొలిరాత్రి అమ్మాయికి రక్తస్రావం అయితేనే కన్యత్వం ఉన్నట్లు అనే మగవారు ఇప్పటికి చాలామందే కనబడతారు. స్త్రీ యోనిలో ఉండే హైమెన్ (కన్నెపొర) మొదటి కలయికలో మాత్రమే చిరుగుతుందని వీరి భావన. సెక్స్ మీద, స్త్రీ శరీరం మీద ఉన్న అతి పురాతనమైన అపోహల్లో ఇది కూడా ఒకటి. అలాగని రక్తం అస్సలు రాదు అని కాదు. ప్రతి స్త్రీ శరీరం ఒకేలా ఉండదు, అలాగే ప్రతి ఒక్కరి అలవాట్లు ఒకేలా ఉండవు. ఈ హైమన్ లేయర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే ఈ విషయం పూర్తిగా అర్థమవుతుంది.

  • చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, పూర్తిగా కన్నెపొర లేకుండా, లేదా చాలా చిన్నగా కన్నెపొరతో కొంతమంది స్త్రీలు పుడతారు. కాబట్టి కన్నెపొర చిరిగితేనే అది మొదటి కలయిక అనుకోవడం మూర్ఖత్వమే.
  • హస్తప్రయోగం చేస్తున్నపుడు కూడా కన్నెపొర చిరిగిపోవచ్చు. ఇది సహజంగా జరిగేదే కదా.. హస్తప్రయోగం లాంటి సహజమైన అలవాటు ఎవరికి ఉండదు.
  • ఆటల్లో పాల్గొనేవారు, డ్యాన్స్, యోగా ఇలాంటి వాటిలో చురుకుగా ఉండేవారు ఎప్పుడో హైమెన్ పొరని పోగొట్టుకుంటారు.
  • కొందరికి కలయికలో కన్నెపొర చిరిగి రక్తం వచ్చినా, నొప్పిగా అనిపించకపోవచ్చు. కాబట్టి నొప్పి లేకపోతే కన్య కాదు అనే అలోచన వద్దు.
  • ప్రతీ స్త్రీలో హైమెన్ ఒకేలా ఉండదు. పరిమాణంలో కూడా వేరుగా ఉండొచ్చు.
  • 60% మహిళలకి మొదటి కలయికలో రక్తం బయటకి రాదట.
  • కొన్ని ఆస్ట్రేలియన్ తెగల్లో పెళ్ళి వారం ముందే పెళ్ళికూతురు హైమెన్ ని ఎవరైనా ముసలిపెద్ద వచ్చి బ్రేక్ చేయడం జరిగేదట. దాంతో ఈ అపోహలకి ఆస్కారం ఉండేది కాదు.

Comments

comments

Comments are closed.