గ్యాస్ సిలిండర్ పై ఆ నంబర్ ఏంటో మీకు తెలుసా? ప్రతి ఒక్కరూ తెల్సుకోవాల్సిన విషయం!!

వంట గ్యాస్ గ్యాస్ సిలిండర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ముప్పు వస్తుంది. చాలా మందికి వంట గ్యాస్ సిలిండర్ నిర్వహణ, సిలిండర్ కు సంబంధించిన కొన్ని విషయాలు అసలే తెలియవు. అయినా వాడేస్తుంటారు. ముఖ్యంగా ప్రతీ వంట గ్యాస్ సిలిండర్ పై ఎక్స్ పయిరీ తేదీ ఉంటుందన్న విషయం తెలిసిన వారు అతి కొద్ది మందే. ఈ గడువు దాటిన తర్వాత మీ ఇంటికి చేరే సిలిండర్లలో లీకేజీ అయ్యే ప్రమాదం ఉంది. దీంతో సిలిండర్ ప్రమాదానికి లోనయ్యే ముప్పు ఉంటుంది. నిజానికి వంటగ్యాస్ పై ఎక్స్ పయిరీ తేదీ విషయం పౌర సరఫరాల శాఖ అధికారుల్లోనే చాలా మందికి తెలియదు. ప్రతీ 100 సిలిండర్లలో సుమారు పది లోపు సిలిండర్లు గడువు దాటిన తర్వాతే కస్టమర్లకు సరఫరా అవుతున్నాయని ఇటీవల రహస్యంగా చేపట్టిన సర్వేలో భయంకరమైన నిజం తేలింది. ప్రతీ సిలిండర్ పై భాగంలో పట్టుకునేందుకు గుండ్రటి హ్యాండిల్ నుంచి కిందకు ఉండే ఓ ప్లేట్ లోపలి వైపు అంకెలు వేసి ఉండడాన్ని చూడొచ్చు. ఈ మూడింటిలో ఒక దానిపై ఆ సిలిండర్ ఎక్స్ పయిరీ తేదీ కూడా ఉంటుంది. దీనిపై సంవత్సరం, నెల వివరాలు ఉంటాయి.

నిజానికి ఇది ఎక్స్ పయిరీ తేదీ అనేకన్నా.. ఆ సిలిండర్ ను ఆ గడువు వరకే వాడుకోవాలన్న ఇండికేషన్. అంటే సిలిండర్ తిరిగి పరీక్షలకు తప్పనిసరిగా వెళ్లి రావాలి. ప్రతీ సిలిండర్ ను నిర్ణీత గడువులోపు భద్రతా ప్రమాణాల దృష్ట్యా తనిఖీ చేయాలని కూడా చట్టం నిర్దేశిస్తోంది. వంటగ్యాస్ సిలిండర్ పై ఉన్న గడువు దీన్నే సూచిస్తుంది. ఎలా అంటే సంవత్సరం, నెల… ఆ సంవత్సరం, ఆ నెలలో ఆ సిలిండర్ ను పరీక్షించాల్సి ఉందని అర్థం. పరీక్షా సమయంలో లోపాలను గుర్తిస్తే సరిచేసిన తర్వాత భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) నుంచి ధ్రువీకరణ సర్టిఫికెట్ ను పొందాలి. ఈ సిలిండర్ వాడేందుకు అనువైన ప్రమాణాల మేరకు ఉందని ఈ ధ్రువీకరణ అన్నమాట. ఆ తర్వాతే సంబంధిత సిలిండర్ పంపిణీకి అందుబాటులోకి వస్తుంది.
ఇలా పరీక్షలు పూర్తి చేసుకున్న సిలిండర్ పై మళ్లీ తిరిగి ఎప్పుడు పరీక్షలకు వెళ్లాల్సి ఉందో… ఆ సంవత్సరం, నెల వివరాలను ముద్రిస్తారు. ‘గ్యాస్ సిలిండర్ పై ఆ నంబర్ ఏంటో మీకు తెలుసా? ప్రతి ఒక్కరూ తెల్సుకోవాల్సిన విషయం!!’అంటూ ఓ వీడియో నెటిజన్లకు ఎంతో క్షేమ సమాచారాన్ని అందిస్తోంది. మీరూ చూడాలనుకుంటే కింది వీడియో క్లిక్ చేయండి..

Comments

comments

Comments are closed.