5 సంవత్సరాల బాలికపై చర్చిఫాదర్ అత్యాచారం.. ఎలా చెప్పాలో తెలియక బొమ్మలు గీచిన బాలిక

ఐదు సంవత్సరాల బాలికపై ఓ చర్చి ఫాదర్ అత్యాచారం చేస్తూ బాలికను లైంగికంగా హింసించాడు. బాలికపై చర్చి ఫాదర్ లైంగిక దాడి చేయడమే అత్యంత విషాదమైతే విషయం బయటపడిన తీరు పలువురిని కలచివేస్తోంది. చర్చి ఫాదర్ దగ్గరకు రోజూ చదుకోవడానికి వెళ్లే ‘జావో దాసిల్వ’ ఐదు సంవత్సరాల బాలిక క్లాసులకు వెళ్లేది. కానీ ఇకపై క్లాసులకు వెళ్లనని మారాం చేయడం మొదలుపెట్టింది.

విసుగెత్తిన తల్లితండ్రులు ఎందుకు వెళ్లవని గట్టిగా ప్రశ్నించడంతో విషయం బయటపడింది. విషయాన్ని ఎలా చెప్పాలో తెలియని చిన్నారి తన భావాన్ని, బాధను బొమ్మలు గీచి వివరించింది. బాలిక గీచిన చిత్రాలను చూసిన తల్లితండ్రులను భయబ్రాంతులకు గురిచేసింది. తనను చర్చి ఫాదర్ ఏవిధంగా లైంగికంగా వేధించేవాడో రెండు చిత్రాలను బాలిక గీచింది. బాలిక గీసిన చిత్రాలు పలువురిని కలచివేస్తున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిన అరెస్ట్ చేశారు.

ఈ ఘటన బ్రెజిల్‌లో జరిగింది. చిన్నపిల్లపై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన చర్చి ఫాదర్‌పై ఆందోళనలు మిన్నంటాయి. ఇలాంటి దారుణాలు జరగడం శోచనీయమని ప్రపంచవ్యాప్తంగా పలువురు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments

Comments are closed.