మెగా హీరో వలన బోయపాటికి అవమానం జరిగింది

BoyapAti-ramcharan

సెంటిమెంట్లతో గ్యాంబ్లింగ్ గా మారిపోతున్న సినిమా రంగంలో జయాపజయాలను అనుభవం ఉన్నవారు కూడ ఊహించలేక పోవడంతో సినిమా బిజినెస్ జూదంకన్నా ఘోరంగా మారిపోయింది. ఈ నేపధ్యంలో ఒక దర్శకుడుకి కానీ లేదా ఒక హీరో హీరోయిన్ కు కాని ఒక్క సూపర్ హిట్ తగిలితే చాలు వాళ్ళ రేంజ్ ఆకాశాన్ని అంటుతోంది. ఇటువంటి పరిస్థుతులలో దర్శకుడిగా నాలుగు సక్సస్ లతో పాటు ఒక సూపర్ హిట్ మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు, ఇప్పటికీ హీరోల ఇంటి చుట్టూ తన కధలను పట్టుకుని గడప గడపకు తిరగడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ దర్శకుడు మరెవ్వరో కాదు బోయపాటి శ్రీను.

బోయపాటి దర్శకత్వం వహించిన సినిమాలలో ఫైల్యూర్ సినిమాగా పరిగణించే జూనియర్ నటించిన ‘దమ్ము’ కూడా 35 కోట్లు వసూలు చేయడం బట్టి బోయపాటి స్టామినా ఏమిటో అర్ధం అవుతుంది. ఈ దశాబ్ద కాలంలో బాలకృష్ణకు రెండు సూపర్ హిట్స్ అందించిన రికార్డ్ ఒక్క బోయపాటికే సొంతం. ఈ నేపధ్యంలో బోయపాటికి మెగా కాంపౌండ్ లో జరిగిన అవమానం టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. లెజెండ్ విడుదల తరువాత చిరంజీవికి తాను రామ్ చరణ్ తో చేద్దామనుకుంటున్న సినిమా కధ లైన్ చెప్పిన తరువాత చిరంజీవి చెప్పిన మార్పులు చేర్పులు చేసుకుని తిరిగి మెగా కాంపౌండ్ లోకి వెళ్ళే లోపే రామ్ చరణ్ బోయపాటికి హ్యాండ్ ఇచ్చి శ్రీను వైట్ల వైపు తిరిగి పోవడం షాకింగ్ న్యూస్ గా మారింది.

విజయాలు ఎన్ని వస్తున్నా తననితాను మార్కెట్ చేసుకోలేని విచిత్ర పరిస్థితిలో తన సినిమా సినిమాకు మధ్య రెండేసి సంవత్సరాలు శూన్యంలో గడిపేస్తూ ఒక విచిత్ర పరిస్థుతుల వలయంలో బోయపాటి చిక్కుకున్నాడు అనే వార్తలు వినపడుతున్నాయి. ‘లెజెండ్’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడికి కూడ అవకాశాలు కరువై పోయిన నేపధ్యంలో సినిమా వాళ్ళ జీవితాలు లాటరీ టిక్కెట్లు లా మారిపోయాయి అంటూ బోయపాటి పై టాలీవుడ్ వర్గాలలో రోజురోజుకీ సానుభూతి పెరిగి పోతోంది.  

సూసైడ్ చేసుకున్న ఫేమస్ హీరోయిన్

ప్రభాస్ కి అర్జెంటు గా యాడ్స్ లో నటించడానికి ఛాన్స్ కావాలి

రభస పోస్టర్స్ విషయం లో ఎన్టీఆర్ కి తీవ్రమయిన అవమానం జరిగింది

ఆరోజు నా జీతం 2000 కాని ఆయన నాకు ఇచ్చిన అప్పు లక్ష – రాజమౌళి

Comments

comments

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>