బిగ్ బాస్ “వోటింగ్” వెనకున్న అసలు కథ బయటపెట్టిన “ప్రిన్స్” తల్లి. ఎలిమినేట్ అవ్వడానికి కారణం అదే?

అనుకున్నదే జరిగింది ..ఎవరనుకున్నారు..ఏం జరిగింది.. బిగ్ బాస్ ఫైనల్ కి వెళ్తాడు ప్రిన్స్ అనుకున్నాం..కానీ ఔట్ అయ్యి బైటికెళ్లాడు..బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రేక్షకులు అనుకున్నట్టు కాదు బిగ్ బాస్ యాజమాన్యం అనుకున్నట్టు జరుగుతుందని మరోసారి ప్రూవ్ అయింది..ఎప్పుడో వెళ్లిపోవాల్సిన ముమైత్ ఖాన్,అర్చన ఇంకా కొనసాగడం ఏంటో..ఫైనల్ కి వెళ్లాల్సిన ప్రిన్స్ బైటికి పోవడం ఏంటో..ఈ డౌట్ ఇప్పటిది కాదు కల్పన ఎలిమినేషన్ అప్పటినుండి,తర్వాత కత్తి మహేశ్,కార్తీక ,ధనరాజ్ ల ఎలిమినేషన్ వరకు  బిగ్ బాస్ యాజమాన్యానికి నచ్చినట్టే ఎలిమినేట్ చేస్తున్నారనేది మరోసారి ప్రూవ్ అయింది.ప్రోగ్రాంలో స్కిన్ షో కి ,కాంట్రవర్సీలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మళ్లీ ప్రూవ్ అయింది.

ప్రిన్స్ ..యువ హీరో ..సినిమాలతో ఆకట్టుకున్నా,ఆకట్టుకోకపోయినా బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా మాత్రం అందరి మనసు దోచుకున్నాడు.మొదటి నుండి కూడా చాలా స్థిరంగా కొనసాగుతు,అన్ని పోటీలు ఎదుర్కుంటూ ప్రోగ్రాంలో నిలదొక్కుకుంటూ వస్తున్నాడు.సడన్ గా ఎలిమినేట్ అయ్యాడు..ఊహించని పరిణామం..ప్రోగ్రాం హోస్ట్ ఎన్టీఆర్ ప్రిన్స్ ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఆదర్శ్ అని చెప్పాడు కానీ రీజన్ మాత్రం చెప్పలేదు..ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే ప్రిన్స్  ని పంపించాం అంటున్నారు.మరోవైపు ప్రిన్స్ తల్లి సునీత ,ప్రిన్స్ నా కొడుకుగా కాదు ఒక కంటెస్టంట్ గా చెప్తున్నా,ప్రోగ్రం లాస్ట్ వరకు కంటిన్యూ అవుతాడనుకున్నా..ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం జరగట్లేదు..మీరు ఏదైతే సైట్లో చూస్తున్నారో అవి నిజమైన ఓటింగ్ కాదు అని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.వాస్తవాలు బిగ్ బాస్ టీం కే తెలియాలి.

Comments

comments

Comments are closed.