షాక్ :లవ్ లో ఓపెన్ అయిపోయిన ప్రిన్స్, అర్చన

బిగ్ బాస్ షోలో నటుడు ప్రిన్స్, సినీ నటి అర్చన లు పాల్గొని బుల్లితెర అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో పాల్గొంటున్న ప్రిన్స్ వారం రోజులు బిగ్ బాస్ హౌస్ కు కెప్టెన్ గా వ్యవహరించి అందరి మన్ననలు పొందాడు. టీం సభ్యురాలు ముమైత్ హిందీ లో మాట్లాడి చేసిన తప్పుకి.. 50 సార్లు స్విమ్మింగ్ పూల్ లో మునిగి బయటకు వచ్చి క్షమాపణలు కోరాలని శిక్ష విధించగా దానిని అమలు చేసి చూపించాడు ప్రిన్స్. అలాగే హిందీలో మాట్లాడిన ముమైత్ ఖాన్ నోటికి ప్లాస్టర్ వేసాడు బిగ్ బాస్. ఇదే షో లో సినీ నటి అర్చన కూడా తనదైన శైలిలో అభిమానులను అలరిస్తుంది.

ఇక తాజాగా వీరిద్దరూ తమ పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడం ఆసక్తి కలిగించింది. వీరిద్దరూ బిగ్ బాస్ షో లో లవ్ లో ఓపెన్ అయి.. తమ ప్రేమ విషయాన్ని బయటకి చెప్పారు. ప్రిన్స్ ఈ సందర్భంగా షోలో తన స్నేహితుడు ఆదర్శ్, అర్చనలతో పిచ్చాపాటి మాట్లాడుతూ.. తాను ఎనిమిదేళ్లు ప్రేమలో ఉన్నానని.. మధ్యమధ్యలో అభిప్రాయభేదాలతో తామిద్దరం దూరం అయ్యే వాళ్లమని.. మళ్ళీ కలుస్తూ ఉండేవాళ్లమని చెప్పాడు. దీంతో లవ్ లో ఓపెన్ అయిపోయిన ప్రిన్స్, అర్చన అందరికి షాక్ ఇచ్చారు. కావాలంటే ఈ వీడియో చూడండి

Comments

comments

Comments are closed.