తన న‌లుగురు ఫ్రెండ్స్ కోరిక తీర్చాలని భార్యను రూములోకి నెట్టి డోర్ లాక్ చేసిన భ‌ర్త‌..

దేశంలో జరుగుతున్నా దారుణాలకు ఏమి తెలియని మగువలు బలైపోతున్నారు. అనుమానంతో, అవేశంతో మద్యం మత్తులోను దారుణంగా మహిళలను వేదించి, చంపేస్తున్నారు. తాజాగ అదిక మొత్తంలో మద్యం సేవించిన ఓ భర్త నీచానికి దిగజారాడు. కట్టుకున్న భార్యను స్నేహితులున్న గదిలోకి నెట్టి డోర్ లాక్ చేశాడు. ఇదే అదనుగా వారు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

సభ్యసమాజం సిగ్గుతో తల దించుకోవలసిన, ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా ధమ్‌పూర్‌ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అనంతరం వారి నుంచి తప్పించుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ అకృత్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఆమె భర్తతో పాటు ఈ ఘోరానికి పాల్పడిన నలుగురు స్నేహితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కేవలం మద్యం మత్తులో వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? లేక ఒక పథకం ప్రకారం ఈ ఆకృత్యానికి ఒడిగాట్టారా? జరిగిన దారుణంలో ఆమె భర్త పాత్ర ఎంతవరకు ఉంది? ఈ విషయాలన్నీ పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Comments

comments

Comments are closed.