హృదయ కాలేయం మూవీ తెలుగు రివ్యూ

hrudaya-kaleyam_review

రివ్యూ     : హృదయ కాలేయం

రేటింగ్     : 2. 25/ 5
దర్శకత్వం : స్టీవెన్ శంకర్ 
నిర్మాత    : సాయి రాజేష్ నీలం 
నటీనటులు: సంపూర్నేష్ బాబు ,ఇషిక సింగ్ ,కావ్య కుమార్ 
సంగీతం   : ఆర్ కే 
విడుదల   : ఏప్రిల్ 4,2014
జోనర్     : కామెడీ ఎంటర్ టైనర్ 
దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఒక్క క్లిక్ తో తన జాతకాన్ని మార్చుకున్న సంపూర్నేష్ బాబు సోషల్ మీడియా లో బర్నింగ్ స్టార్ గా ఎదిగాడు. సోషల్ మీడియా హీరో అయిన సంపూ హీరోగా తెరకెక్కిన సినిమా ‘హృదయ కాలేయం’. ‘ఎ కిడ్నీ విత్ హార్ట్’ అన్నది ఉపశీర్షిక, ఈ సినిమా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టీవెన్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సాయి రాజేష్ నీలం నిర్మాత. సంపూర్నేష్ బాబు సరసన ఇషిక సింగ్, కావ్య కుమార్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి ఆర్.కె సంగీతం అందించాడు. సోషల్ మీడియాలో బర్నింగ్ స్టార్ అయిన సంపూ …. హృదయ కాలేయం తో వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించు కోడానికి వచ్చాడు,మరి ప్రేక్షకులను ఆకట్టు కున్నాడా …. లేదా అన్నది ఓ లుక్కేద్దామా !

కథ :
సిటీలోని సిటీ ఎలక్ట్రికల్ షాప్ లలో జరుగుతున్న దొంగతనాలను అరికట్టడానికి పోలీసులు తెగ ట్రై చేస్తుంటారు. కానీ పట్టుకోలేక పోతుంటారు. ఆ దొంగతనాలను చేస్తున్నది  సంపూ(సంపూర్నేష్ బాబు) అని పోలీసులకు తెలుస్తుంది. దాంతో అతన్ని పట్టుకోవడానికి ఓ స్పెషల్ టీంని రంగంలోకి దింఛి సంపూర్నేష్ బాబుని అరెస్ట్ చేస్తారు.అలా ఫ్లాష్ బ్యాక్ కు వెళితే అక్కడ మరో కథ మొదలౌతుంది, ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి ….. సంపూ గోల ఏంటనేది తెలుసు కోవాలంటే ‘హృదయ కాలేయం తెరపై చూడాల్సిందే!
ప్లస్ పాయింట్స్ : 
బాబులకు బాబులా ఫోజు కొడుతూ ఇప్పటి వరకూ పోస్టర్స్, ట్రైలర్స్ లో మాత్రమే సంచలనం సృష్టించిన సంపూ ప్రేక్షకులను మెప్పించడంలో కూడా ఎక్కడా నిరుత్సాహపరచలేదు. సినిమా మొత్తం తన కామెడీతో, డాన్సులతో, ఫైట్స్ లతో ప్రేక్షకులను ఆద్యంతం నవ్విస్తాడు. సంపూ చెప్పిన డైలాగ్స్ చాలా ఎంటర్ టైన్మెంట్ గా ఉండటంతో కామెడీ కోరుకునే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు .హీరోయిన్ కావ్య కుమార్ బాగుంది అలాగే తన పాత్ర వరకూ బాగానే చేసింది.
మైనస్ పాయింట్స్ : 
ఇది ఒక సెటైరికల్ సినిమా కావడంతో లాజిక్కులకు సంబంధం లేకుండా సాగిపోతుంది,ఎంతసేపు భారీ డైలాగులతో ,పంచ్ లతో నవ్వించాలనే ప్రయత్నంలో మరీ శృతి మించి పోయిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి అవి సంపూ ని ఫాలో అవుతున్న సోషల్ మీడియా వాళ్ళకు బాగానే ఉంటుంది కానీ అసలు సంపూ అంటే తెలియని వాళ్ళకు చిరాగ్గా అనిపిస్తుంది. బిల్డప్ మరీ ఎక్కువ కావడంతో కొంత ఎబ్బెట్టుగా అనిపిస్తుంది . 
సాంకేతిక వర్గం  :
ఈ విభాగంలో ముందుగా చెప్పుకోవాల్సింది రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫీ గురించి చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ విజువల్ గా రిచ్ గా చూపించాడు. ఆర్.కె అందించిన సంగీతం షరా మామూలే పాటలు ఓ మాదిరిగా ఉన్నాయి. ఎడిటర్ కు ఇంకాస్త పని ఉంది కానీ వదిలేసాడు ,నిర్మాణ పరంగా తమ శక్తి మేరకు ఓకే అనిపించుకున్నారు.ఇక డైరెక్టర్ స్టీవెన్ శంకర్ కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – దర్శకత్వ విభాగాలను బాగానే హ్యాండిల్ చేసాడు. సంపూకి రాసిన పంచ్ డైలాగ్స్ ఆడియన్స్ ని తెగ నవ్విస్తాయి. అలాగే మొదటి సినిమాతోతన టాలెంట్ ని చూపించిన డైరెక్టర్ స్టీవెన్ శంకర్ మంచి మార్కులే సంపాదించాడు. 
విశ్లేషణ  :
అందవిహీనంగా ఉన్న సంపూర్నేష్ బాబు పెర్ఫార్మెన్స్ హైలెట్ గా ,సెటైరికల్ గా సాగే ఈ సినిమా జస్ట్ టైం పాస్ కోసమైతే తప్పనిసరిగా ఆ టైం ని పాసయ్యేలా చేసే సినిమా ఇది. సంపూ ఆకారం ,అతడి డైలాగ్స్ ఖచ్చితంగా నవ్వు తెప్పిస్తాయి. టాలెంట్ ఉన్న కొంతమంది కలిసి చేసిన ఈ సినిమా విడుదలకు ముందే ఆర్ధికంగా హిట్ అయినప్పటికీ హర్దికంగా హిట్ అవుతుందా అంటే మాత్రం చెప్పలేని పరిస్థితి . తమ చిత్రానికి క్రేజ్ తీసుకురావడంలో మాత్రం సఫలం అయ్యారు సంపూ అండ్ కో … !
పంచ్ లైన్ : పిచ్చ కామెడీ తో……  సంపుతున్న సంపూ !

Comments

comments

Comments are closed.