మహేష్ బాబు కరుణిచట్లేదు

ఒకప్పుడు చిరంజీవితో సూపర్‌హిట్‌ సినిమాలు అందించి, అగ్ర నిర్మాణ సంస్థ అంటే వైజయంతి మూవీస్‌ తర్వాతే అనేంత లావిష్‌గా సినిమాలు తీసిన అశ్వనీదత్‌కి హిట్‌ వచ్చి చాలా కాలమవుతోంది. వరుసగా వచ్చిన ఫ్లాపులతో నష్టాల్లో పడిపోయిన అశ్వనీదత్‌ ఎన్నో రోజులుగా ఒక సినిమా మొదలు పెట్టాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. మహేష్‌బాబు హీరోగా సినిమా తీయాలని ఆయన ఎన్ని ప్లాన్స్‌ వేసుకున్నా ఇంతవరకు ఏదీ సక్సెస్‌ కాలేదు. కథ విన్న తర్వాత మహేష్‌ మళ్లీ కనిపించకుండా పోవడం, వేరే నిర్మాతలు ఎవరికో డేట్స్‌ ఇచ్చేయడం జరుగుతోంది. 

మహేష్‌ని రాజకుమారుడిగా పరిచయం చేసిన ఈ బ్యానర్లో ఇప్పుడు ప్రిన్స్‌తో సినిమా ఎప్పుడనేది కూడా చెప్పడం కష్టంగా మారింది. మహేష్‌ని ఎక్సయిట్‌ చేసే ప్రాజెక్ట్స్‌ని అశ్వనీదత్‌ సెట్‌ చేయలేకపోతున్నాడు. కొన్ని సబ్జెక్ట్స్‌ విన్నా కానీ ధైర్యంగా ముందుకి వెళ్లి సినిమా చేసే సాహసానికి దిగలేకపోతున్నాడు. దీంతో అశ్వనీదత్‌కి ఎదురు చూపులే మిగుల్తున్నాయి. ఫైనాన్షియర్ల నుంచి ఒత్తిడి ఉందో లేక మహేష్‌కి తనతో సినిమా చేస్తానని మాటిచ్చావనే సంగతి గుర్తు చేస్తున్నాడో కానీ తరచుగా ఆయన మహేష్‌తో ఫలానా సినిమా తీయబోతున్నానంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఆ ప్రాజెక్ట్స్‌ విన్నప్పుడే డౌట్‌ఫుల్‌ అనేది క్లియర్‌గా తెలిసిపోతోంది. పాపం పెద్దాయనపై మహేష్‌ ఎప్పుడో కరుణ చూపుతాడో ఏమిటో?

Comments

comments

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>