భరత్ మరణం.. అడుగడుగునా మిస్టరీ.. హాస్పిటల్ నుండి భరత్ దేహాన్ని తీసుకోవటానికీ రవితేజ కుటుంబం నిరాకరణ.. అసలేం జరిగింది?!!

రాత్రి 10 గంటలకి రోడ్డు ప్రమాదం జరిగింది. మరుసటి రోజు ఉదయం 10 గంటలకిగాని ఆ ప్రమాదంలో చనిపోయింది స్వయాన హీరో రవితేజ సోదరుడు భరత్ అని మీడియా తెలుసుకోలేకపోయింది. అసలేం జరిగింది? జేబులో ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా కూడా చనిపోయింది ఎవరన్న విషయాన్ని గుర్తించడానికి అంత టైం ఎందుకు పట్టింది? ఉదయం 10 గంటల తర్వాత టీవీల్లో స్క్రోల్స్ వస్తుండడంతో మీడియాతో మాట్లాడిన పోలీసులు చనిపోయింది భరత్ అని గుర్తించటం కష్టమైందని చెప్పడం విస్తుపర్చింది. జేబులో ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, సీ బుక్.. అన్నింటిని మించి సెల్‌ఫోన్ ఉన్న తర్వాత కూడా భరత్‌ని గుర్తించటానికి 6 గంటల సమయం పట్టినట్లు చెబుతుండడం వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు? ఇదే ఈరోజు హాట్ టాపిక్..అద్దెకు తెచ్చిన వ్యక్తి తలకొరివిపెట్టడం.. అంతేకాదు మూడో రోజు చిన్న కర్మ కూడా అతగాడే చేయడం.. కుటుంబ సభ్యులు దూరంగా ఉండడం.. గుట్టు చప్పుడు కాకుండానే భరత్ అంత్యక్రియలు పూర్తి చేయాలని రవితేజ కుటుంబం భావించిందా? అనే అనుమానాలకు తావిస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. భరత్ కుటుంబ సభ్యులకు చనిపోయిన విషయం ఆ రోజు రాత్రి 12 గంటలకే తెలిసింది. అయితే ఆ విషయం మీడియాకి పొక్కకుండా చూడాలని ప్లాన్ చేశారట. అయితే ఒక పోలీసు నుంచి ఉదయం 8.30 సమయంలో ఒక మీడియా ప్రతినిధికి విషయం తెలియడంతో వారి ప్లాన్ చెదిరిపోయినట్లు తెలుస్తోంది. ఒక వేళ ఆ పోలీసు విషయం లీక్ చేసి ఉండకపోతే మీడియాకి తెలియకుండానే భరత్ కథ సమాప్తం అయి ఉండేదని ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి ఆఫ్ ది రికార్డ్‌గా చెబుతున్న మాట.

రవితేజ తల్లి భూపతిరాజు రాజ్యలక్ష్మి. తండ్రి రాజు. భరత్ విషయములో రవితేజ అంత అమానవీయంగా ఉండటం అటు భరత్ స్నేహితులనే కాదు సామాన్య ప్రజానీకాన్ని కూడా ఆశ్చర్యపడేలా చేస్తోంది. కేవలం ముఖం చూసి తట్టుకోలేకే మహాప్రస్థానానికి రాలేక పోయామని చెప్పటం అంత నమ్మశక్యంగా లేదని పలువురి భావన. అయితే మూడేళ్లుగా భరత్‌ను కుటుంబమంతా వెలివేసినంత పని చేసినట్లు సమాచారం. రవితేజ ఇమేజ్‌ను భరత్ సర్వనాశనం చేస్తున్నాడని తల్లిదండ్రులు పలువురి వద్ద ప్రస్తావించినట్లు
సమాచారం. అందుకే అతణ్ణి కుటుంబం దూరంగా పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే అంత్యక్రియలను రహస్యంగా కానిచ్చేయాలని వారంతా భావించినట్లుగా జరిగిన ఘటనల తీరు స్పష్టం చేస్తోంది. అయితే ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది… పోస్ట్‌మార్టం సమయంలోనూ బయటివాళ్లే ఉండటం మరో దిగ్భ్రాంతి కలిగించే విషయం. డ్రైవర్ కుమార్‌నే మృతదేహాన్ని తీసుకుని మహాప్రస్థానానికి వెళ్లాలని భావించారట. అయితే రక్త సంబంధీకులు లేనిదే మృతదేహాన్ని అప్పగించబోమని ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది తేల్చి చెప్పడంతో డ్రైవర్ కుమార్ మళ్లీ భరత్ తల్లి రాజ్యలక్ష్మిని సంప్రదించాడు. అందుకే చిన్న కుమారుడు రఘుని అప్పటికప్పుడు ఆసుపత్రికి పంపించారట. అయితే భరత్ మృతదేహాన్ని తమ నివాసానికి తీసుకురాకుండా నేరుగా మహాప్రస్థానానికి తీసుకువెళ్ళాల్సిందిగా చెప్పడంపైనే ఇప్పులు అనుమానాలన్నీ కేంద్రీకృతమయ్యాయి.

రవితేజ కానీ, తండ్రి రాజు కానీ, సోదరుడు రఘు కానీ భరత్‌కు తలకొరివి పెట్టకూడదని ఆ కుటుంబం ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే అద్దె వ్యక్తితో అంత్యక్రియలు జరిపించేందుకు నిర్ణయం తీసుకొచ్చారు. మృతదేహాన్ని మొదట కట్టెల మీద కాల్చే ఆలోచన చేసినప్పటికీ.. మీడియా కెమెరాల్లో ఆ బయటవ్యక్తి కనిపిస్తే అతడు ఎవరు అన్న ప్రశ్న వస్తుందనే అనుమానంతో ఆఖరి నిమిషంలో ఎలక్ట్రిక్ దహనవాటికకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే చిన్న కర్మ మాత్రం అద్దెకు వచ్చిన వ్యక్తితోనే పూర్తి చేయించారనేది తాజా సమాచారం. అతడికి తోడుగా దూరపు బంధువు మూర్తి రాజు కూడా ఉండేలా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. తల్లి, తండ్రి, అన్న, కుటుంబం, బంధువులు అందరూ కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండికూడా అంత్యక్రియలలో పాల్గొనకపోవటం బహుశా ఈ మధ్య కాలంలో మన చుట్టు పక్కన ఎక్కడా జరగని విషాద ఘటన. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవితేజ.. ఎన్నో కష్టాలు పడి అంచలంచెలుగా ఎదిగి మాస్‌ మహారాజా అయ్యారు. ఇప్పటివరకు రవితేజను అందరూ అభిమానించేవారే. అయితే తమ్ముడి మరణం విషయంలో అమానవీయంగా ప్రవర్తించడం పట్ల రవితేజపై అందరికీ విముఖత పెంచింది. అందుబాటులో ఉండి కూడా తోడబుట్టిన తమ్ముడి అంత్యక్రియలకు హాజరుకాకపోవడం రవితేజకు మాయని మచ్చగా మిగిలిపోతుందని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అందరూ ఉండి కూడా అనాథలా భరత్ అంత్యక్రియలు జరిగాయని, టెర్రరిస్టులకు కూడా రాని దుస్థితి భరత్‌కు వచ్చిందని సోషల్‌మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా రవితేజ ప్రవర్తన మరింత మందిని ఆగ్రహానికి గురిచేస్తోంది. తమ్ముడు చనిపోయిన మరుసటి రోజు రవితేజ షూటింగ్‌లో పాల్గొన్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా ది గ్రేట్’ షూటింగ్ అన్నపూర్ణ స్టుడియోలో జరుగుతోంది. తమ్ముడి మరణంతో బాధలో ఉన్న రవితేజ షూటింగ్‌కు వస్తారో లేదో అని డైరెక్టర్ అనిల్ రావిపూడి షూటింగ్‌ను వాయిదా వేయాలనుకున్నారట. అయితే అనిల్‌కు షాకిస్తూ.. ‘నేను షూటింగ్‌కు వస్తున్నాను’ అని రవితేజ ఫోన్ చేసి చెప్పారట.

Comments

comments

Comments are closed.