బాలయ్య బాబు ఫాన్స్ కి కాలింది అంటే టిక్కెట్ చిరిగిపొద్ది అని తెలుసుకుంటే మంచిది

balakrishna_contraversy
ఏంటో ఈ మధ్య ప్రతి ఒక్కడు చాల చీప్ పబ్లిసిటీ ని చాల చెండాలం గా ప్లాన్ చేస్తున్నారు . కాంట్రవర్సీతోనే సినిమాకు పబ్లిసిటీకి ప్లాన్ చేసుకుంటున్నారు. నిజానికి ఈ తరహా పబ్లిసిటీకి వాళ్ళు చాలా ఆలోచించి పలురకాల టెక్నిక్స్ వాడి ఈ డిజైన్స్ చేస్తున్నారు. అయితే కేవలం వైవిధ్యంగా ఉన్నా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కానీ, వైవిధ్యంగా కన్నా కాంట్రవర్సీనే నమ్ముకుంటున్నాయి.
 
అసలు మేటర్ ఏంటి అంటే  తాజాగా ‘ఇదేగా ఆశపడ్డావ్ బాల-కృష్ణ’ అనే సినిమా పేరుతో ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సినిమా పేరు ఎలా ఉన్నాకానీ ఈ టైటిల్ ను మాన్షన్ హౌస్ మందు బాటిల్ కు లేబుల్ స్థానంలో వేసి కింద ట్యాగ్ లైన్ గా బెస్ట్ వాచెడ్ విత్ సోడా అని పెట్టారు. ఈ పోస్టర్ కొందరి దృష్టిని ఆకర్షిస్తే.. మరికొందరికి మాత్రం తీవ్రంగా ఆగ్రహం కలిగిస్తుంది.
 
ఎందుకంటే నందమూరి బాలయ్యకు మాన్షన్ హౌస్ ఫేవరేట్ అని ఇండస్ట్రీతో పాటు మీడియాలో కూడా ఓ టాక్ ఉంది. అయితే అది ఎంతవరకు నిజమన్నది తెలియదు కానీ ఇప్పుడు దానినే బేస్ చేసుకొనే ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. తమిలంలో వచ్చిన ‘ఇదరకుతనే ఆసైపట్టై బాలకుమార’ సినిమాకు డబ్బింగ్ సినిమా ఇది. అయితే అభిమానుల మనస్సు నొచ్చుకొని వరకు పబ్లిసిటీ అయితే ఒకేకానీ.. ఇలా శృతిమించితే మాత్రం వెండితెర చిరిగిపోద్దని తెలుసుకొంటే మంచిది! బాలకృష్ణ ఇలాంటి విషయాల్ని పటించుకునే మనిషి కూడా కాదు  కాని ఫాన్స్ కనుక ఈ విషయాని సీరియస్ గా తీసుకుంటే టిక్కెట్ చిరిగిపొద్ది అని తెలుసుకుంటే మంచిది . 

Comments

comments

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>