పద్నాలుగు రీళ్లకు ఉహించిన షాకిచ్చిన ‘శ్రీను’

agadu

అందలమెక్కినా, అజ్ఞాతంలోకి కూరుకుపోవాలన్నా ఒక్క సినిమా చాలు అని తెలుపుతున్న రోజులివి. ఎన్నో హిట్ సినిమాలు తీసి బిల్డ్ చేసుకున్న స్టార్ డమ్ ఒక్క సినిమాతో డామ్ అని పడిపోతుంది. అందుకే కె. విశ్వనాధ్ వంటి దిగ్గజ దర్శకులు సినిమాలు తీయకుండా అలానే ఖాళీగా వుండిపోతున్నారు. టాలీవుడ్ కి తన మార్కు స్టోరీ టెల్లింగ్ ని పరిచయం చేసిన శ్రీను వైట్ల ‘ఆగడు’ సినిమా దెబ్బకు కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాడనే చెప్పాలి.

ఒక్కసారి ఈ సినిమా ఫలితానికి గల కారణాన్ని అంతర్మధనం చేసుకుంటే సామాన్య ప్రేక్షకులకు అర్ధం కానీ భారీ లెంగ్త్ డైలాగులు, సామాన్య ప్రజలు సైతం అంగీకరించలేని మాస్ హీరోయిజం సినిమాలో లెక్కలేనంత వుంది. దీనికి తోడు తమన్ నాసిరకం సంగీతం తోడవ్వడంతో మరీ పూడ్చలేని లోటు ఏర్పడింది. దీంతో శ్రీను వైట్ల పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవడానికి సిద్ధమయ్యాడు.

తన స్నేహితులుగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన 14రీల్స్ సంస్థకి తన ద్వారా భారీ నష్టం వచ్చిందని బావిస్తూ తన తదుపరి సినిమా వారితోనే చేస్తానని, దాని నిమిత్తం ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోనని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే భారీ సినిమాల మోజు నుండి బయటపడి 14రీల్స్ ప్రస్తుతం ఒక చిన్న సినిమాను నిర్మించే పనిలో వున్నట్టు సమాచారం. మరి ఈ షాకింగ్ స్టేట్మెంట్ ని ఆ నిర్మాతల త్రయం ఎలా తీసుకుంటారో త్వరలోనే తెలుస్తుంది.

పెన్ కెమెరా లో హీరోయిన్ డ్రెస్సింగ్ వీడియో

నిత్య మీనన్ పాపం చిన్న వయస్సులోనే లవ్ వలన మోసపోయింది అంట

నిత్య మీనన్ నోటి దూల కొంప ముంచింది

పవన్ గురించి నిజాలు చెప్పిన రేణు దేశాయ్

Comments

comments

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>