నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్ లో జూనియర్ ను చిరాకు పెడుతున్న ఆ సమస్య ?

ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరగబోతున్న ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో వేడుకలో జూనియర్ కు ఎదురు అయ్యే ఒక సున్నిత సమస్య నుండి. ఎలా బయట పడతాడు అన్న ఆ శక్తి చాలామందిలో ఉంది. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సున్నిత సమస్య పై జూనియర్ కూడ చాల తెలివిగా స్పందించడానికి నిర్ణయించుకున్నాడు అని టాక్.
ఈమధ్య కాలంలో మెగా కుటుంబ హీరోల సినిమాల ఆడియో ఫంక్షన్స్ కు ఎదురౌతున్న కొన్ని సమస్యలే ప్రస్తుతం జూనియర్ కు కూడ ఎదురౌతున్నాయి అని తెలుస్తోంది. మెగా హీరోల ఆడియో ఫంక్షన్స్ లో పవన్ నామస్మరణ లేకుండా ఫంక్షన్ పూర్తి కావడం లేదు. ఇప్పుడు అదే సమస్య ఈరోజు జరగబోతున్న ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో ఫంక్షన్ లో కొందరు వీరాభిమానులు చేసే ‘జై బాలయ్యా’ నినాదాలతో జూనియర్ ను ఇరుకున పెడుతుందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఎప్పుడూ లేని విధంగా ఈ సంక్రాంతికి బాబాయి అబ్బాయి సినిమాల మధ్య వార్ జురుగుతూ ఉండటంతో బాలకృష్ణ అభిమానులు ‘డిక్టేటర్’ సినిమా గురించి చాల విపరీతంగా టెన్షన్ పడుతున్నట్లు టాక్. ఈ టెన్షన్ తో కొంతమంది బాలకృష్ణ వీరాభిమానులు తమ టెన్షన్ ను అసహనంగా మార్చి ఈరోజు జూనియర్ సినిమా ఆడియో ఫంక్షన్ లో జై బాలయ్యా నినాదాలతో జూనియర్ ను ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి.
ఈ విషయాలు జూనియర్ దృష్టి వరకు వెళ్ళడంతో ఈరోజు జరగబోతున్న తన సినిమా ఆడియో వేడుకకు సంబంధించి పాస్ లు విషయంలో కేవలం జూనియర్ అభిమానులకు మాత్రమే అందేడట్లుగా చూడాలని ఎట్టి పరిస్తుతులలోను తన వ్యతిరేక వర్గమైన బాలయ్య అభిమానులకు పాస్ లు ఇవ్వవద్దని జూనియర్ ఈ కార్యక్రమ నిర్వాహకులకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు టాక్. ఈ వార్తలు బయటకు రావడంతో బాలకృష్ణ అభిమానులు ఏదోవిధంగా ఈరోజు జరగబోతున్న ఆడియో వేడుకలో ‘జై బాలయ్య’ నినాదాలు చేస్తే జూనియర్ ఎలా తెలివిగా బయట పడతాడు అన్న ఆ శక్తి అందరిలోనూ ఉంది..

Comments

comments

Comments are closed.