డిజాస్టర్ మూవీని సెలెక్ట్ చేసుకున్న రామ్ చరణ్

chiru-Rachcha clap

మెగాహీరో రామ్ చరణ్ హీరోగా నటించిన మూవీ మగధీర ఎంతటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని సాధించిందో అందరికి తెలుసు. రామ్ చరణ్ కెరీర్ లో మగధీర మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే మగధీర లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత రామ్ చరణ్ నటించిన మూవీ ఆరెంజ్. ఆరెంజ్ మూవీ సైతం టాలీవుడ్ బాక్సాపీస్ ని షేక్ చేయడం ఖాయం అనుకుంటున్న సందర్భంలో, ఆ మూవీ పూర్తి రివర్స్ లో రిజల్డ్ ని తెచ్చుకుంది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గోవిందుడు అందరి వాడే’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటివల తను అభిమానులతో ఇంటరాక్ట్ అయి, ఎన్నో విషయాలను వారితో పంచుకున్నాడు. అయితే ఆ సందర్భంలో తను ఓ విషయాన్ని గుర్తుకుచేసుకున్నాడు. ఆ సందర్భంగా, చరణ్ కి ‘ఆరెంజ్’ లాంటి చిత్రం మళ్లీ చేయాలనుందని తెలిపాడు.

అంతేకాకుండా తనకి ఆ చిత్రం ఎంతో ఇష్టమని కాకపోతే ఆ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడింది అన్నారు. ‘మగధీర’ తర్వాత ఎన్నో అంచనాల మధ్య ‘ఆరెంజ్’ విడుదల అయ్యింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నాగబాబు నిర్మించారు. హ్యారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం లో రామ్ చరణ్ సరసన జెనిలియా నటించింది. ఈ మూవీ ఇచ్చిన డిజాస్టర్ కి నిర్మాత నాగబాబు సైతం ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఎదుర్కొవలసి వచ్చింది. ప్రస్తుతం రామ్ చరణ్ కెరీర్ ఫుల్ జోష్ లో ఉండగా, మళ్ళీ ఆరెంజ్ లాంటి సబ్జెట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ చెప్పటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈసారి ఆరెంజ్ తరహా సబ్జెట్ ని కమర్షిల్ ఎలిమెంట్స్ తో తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తా అన్నాడు.

అనుకునదోకటి అయ్యినదోకటి బోల్తాకోట్టింది లే ఉదయభాను

నాగార్జునని నిలువునా ముంచిన కెసిఆర్

సూసైడ్ చేసుకున్న ఫేమస్ హీరోయిన్

ప్రభాస్ కి అర్జెంటు గా యాడ్స్ లో నటించడానికి ఛాన్స్ కావాలి

Comments

comments

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>