ఆ హిరో కోసం ‘లౌక్యం’ ని ఎత్తేసారని దాసరి సంచలన వాఖ్యలు!

dasari-hot-coments

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో రౌడీయిజం నడుస్తోందని ప్రముఖ దర్శకుడు దాసరి సంచలన వ్యాఖ్యలు చేశారు.  పెద్ద హీరో సినిమా కోసం చిన్న సినిమాలను తీసేస్తున్నారని ఆయన అన్నారు. తెలుగు సినిమా ప్రస్తుతం కబ్జాకోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోందని దాసరి అన్నారు. కొంతమంది బడా నిర్మాతలు, వ్యక్తులు తమ చెప్పేచేతల్లో థియేటర్లను ఉంచుకుని చిన్న సినిమాలతో పాటు చిన్న నిర్మాతల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని దాసరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దుర్భర పరిస్థితి తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని కూడా ఆయన అన్నారు.

ఇటీవల వచ్చిన గోపీచంద్ హిట్ చిత్రం లౌక్యం సినిమాను ఆ సినిమా తర్వాత వచ్చిన మరో పెద్ద సినిమా కోసం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న 37 థియేటర్ల నుంచి తొలగించి ఆ పెద్ద సినిమా వేశారని అన్నారు. చివరకు ఆ సినిమా సరిగా ఆడకపోవడంతో తిరిగి ఆ సెంటర్లలో మళ్లీ లౌక్యం సినిమాను ప్రదర్శించడం చూస్తుంటే తెలుగు చిత్ర పరిశ్రమల ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉందో అర్థమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దాసరి వ్యాఖ్యలు చూస్తే లౌక్యం తర్వాత ఛెర్రీ గోవిందుడు అందరివాడేలే సినిమాయే వచ్చింది. ఆ సినిమా కోసమే లౌక్యం సినిమాను ఎత్తివేసి తిరిగి ప్రదర్శించారు.

సినిమాలోకి మరో భారత సంతతి బ్లూ ఫిల్మ్ నటి

అమ్మడితో అర్ధరాత్రి అడ్డం గా బుక్ అయ్యిపోయిన విరాట్ కోహ్లి

హీరో ని చెప్పు తో కొట్టిన హీరోయిన్

అభిమానులను టార్చర్ పెడుతున్న బాలయ్య కొత్త నిర్ణయం

Comments

comments

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>